మాజీ ప్రియుడితో మళ్లీ లవ్‌లో రష్మిక

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఈ భామ నటిస్తోంది. కన్నడ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టినా.. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ అనే సినిమాలో కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టింది రష్మిక.

rashmika mandanna

ఆ సినిమా సమయంలోనే రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకునేలోపు విడిపోయారు. ఆ తర్వాత ఇప్పటివరకు వీరిద్దరు అసలు మాట్లాడుకోలేదు. తాజాగా ‘కిర్రాక్ పార్టీ’ సినిమాలోని ‘బెలగెద్దు యారా మగువా’ అనే పాట యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్, హీరో రక్షిత్ శెట్టి పేరును ట్యాగ్ చేస్తూ రష్మిక ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది. వంద మిలియన్ల వ్యూస్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది.

రష్మిక ట్వీట్‌పై రక్షిత్ శెట్టి స్పందించాడు. ‘నువ్వు ఇంకా ఇంకా పైపైకి ఎదగాలి. నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. చాలాకాలం తర్వాత ఈ మాజీ లవ్ బర్డ్స్ మళ్లీ మాట్లాడుకోవడంతో.. ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ లవర్స్ మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.