ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో అభిమానికి సోనూసూద్ సర్‌ప్రైజ్

లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. ఆయనను స్పూర్తికి తీసుకుని ఎంతోమంది యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అయితే సోనూసూద్‌కు ఏకంగా గుడి కట్టించి దేవునిలా పూజలు చేస్తున్ారు. సోనూసూద్‌ని స్పూర్తిగా తీసుకున్న హైదరాబాద్‌కు చెందిన అనిల్ కుమార్.. బేగంపేటలోని ప్రకాశ్ నగర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంబర్‌ని నిర్వహిస్తున్నాడు. ఈ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు ‘లక్ష్మీ సోనూసూద్’ అని పేరు పెట్టి సోనూసూద్ ఫొటో వాడుకున్నాడు.

sonusood

ఇది సోషల్ మీడియాలో వైరల్ అయి సోనూసూద్ దృష్టికి వెళ్లింది. దీంతో తాజాగా సోనూసూద్ అనిల్ కుమార్ నడుపుతున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ని సందర్శించాడు. సోనూసూద్ వచ్చాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి వెళ్లి స్వయంగా గరిట తిప్పి అక్కడున్న వారిని తింటారా అని సోనూసూద్ పలకరించాడు.

అంతేకాకుండా అనిల్ కుమార్ తయారుచేసిన ఎగ్‌ఫ్రైడ్ రైస్‌ని సోనూసూద్ తిని చాలా బాగుందని కితాబిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.