ఆ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్?

సోషల్ మీడియాలో హీరోయిన్స్ గురించి వచ్చే రూమర్లు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం రష్మిక గురించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అది ఏంటంటే.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా డేటింగ్ చేస్తుందట. ప్రస్తుతం అనేక వెబ్‌సైట్లలో ఈ వార్త కనిపిస్తోంది.

RASHMIKA

అనుపమ పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్ ప్రముఖ యానిమేటెడ్ డైరెక్టర్ చిరంజీవ్ మక్వాన. ఈ మధ్య స్కూబ్ అనే యానిమేటెడ్ సినిమాను తెరకెక్కించగా.. ఇది ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అతడితో రష్మిక గత కొంతకాలంగా డేటింగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రష్మిక నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న ఒక సినిమాలో కూడా నటిస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తమిళంలో తల్లి పోగతాయై అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్స్‌గా అనుపమ, రష్మిక పేరు తెచ్చుకన్నారు. రెండు భాషల్లోనూ స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేస్తున్నారు.