బిగ్‌బాస్ కంటెస్టెంట్ సన్యాసం తీసుకోనుందట

బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానా సన్యాసం తీసుకోనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో పాపులర్ అయిన ఈ యాంకర్.. బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో మరింత ఫేమస్ అయింది. హౌస్‌లో తన ఆట తాను ఆడుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అరియానా విన్నర్ కాకపోయినా రన్నన్ అయినా అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బోల్డ్‌గా ఉన్నది ఉన్నట్లు అరియానా గ్లోరీ మాట్లాడుతూ ఉంటుంది. మనస్సులో ఏం దాచుకోదు. దీని వల్ల ఆమెకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు.

BIGBOSS4

అయితే అరియానా సన్యాసం తీసుకోనుందనే వార్తలతో ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ వార్తలపై అరియానా సోదరి నైనా కూడా స్పందించింది. సన్యాసం తీసుకుంటానని అప్పుడప్పుడు తనతో అరియానా చెప్పేదని, అలాగే స్నేహితులతో కూడా చెబుతూ ఉండేదంది. సరదా కోసమే అలా చెబుతుందని తాను అనుకుంటున్నానని నైనా చెప్పింది. ప్రేక్షకులు అరియానాను చాలా అభిమానిస్తున్నారని, విన్నర్ అయ్యే అవకాశముందని నైనా తెలిపింది.

అరియానా దేవుని కంటే హ్యుమానిటీని నమ్ముతుందని, ఇతరులకు సాయం చేస్తే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులు సాయం చేస్తారని విశ్వసిస్తుందని నైనా చెప్పింది. అరియానా విన్నర్ కాకపోతే అభిజిత్, అవినాష్, సోహైలలో ఒకరు అయ్యే అవకాశముందని చెప్పింది. ఏది ఏమైనా బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత అరియానా సన్యాసం తీసుకోనుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో..