Rashmika: పుష్ప కోసం రోజు 4గంట‌లే నిద్ర.. క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం తెర‌పై క‌నిపిస్తుంది: ర‌ష్మిక

Rashmika: స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా Rashmika ర‌ష్మిక పుష్ప షూట్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. అల్లు అర్జున్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాను.

rashmika pushpa

ఆయ‌న‌లో మంచిత‌నం ఎక్కువ.. మ‌న‌సు ప‌రంగా చిన్న‌పిల్లాడు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం సుల‌భ‌మే. అలాగే ఈ చిత్ర షూటింగ్ చాలా క‌ష్ట‌త‌రంగా సాగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను చేసిన చిత్రాల్లో పుష్ప ఎంతో విభిన్న‌మైన చిత్రం. ప్ర‌స్తుతం సుదూర ప్రాంతాల్లో త‌మ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో తాము ఉద‌యం 4గంట‌ల‌కు నిద్ర‌లేచి లొకేష‌న్‌కు చేరుకుంటున్నాం. మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చేస‌రికి రాత్రి 10అవుతోంది. డిన్న‌ర్‌, సాధ‌న చేసి నిద్ర‌పోయేస‌రికి 12నుంచి ఒంటిగంట అవ‌తుంది. దీనివ‌ల్ల నేను కేవ‌లం నాలుగు గంట‌లే నిద్ర‌పోతున్నాను. కాబ‌ట్టి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని మీరు తెర‌పై చూస్తారు.. అలాగే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ మేక‌ప్ చాలా కీల‌క‌మైంద‌ని.. దీనికోసం రెండు గంట‌లు కేటాయించాల్సి ఉంటుంద‌ని Rashmika ర‌ష్మిక పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తుండ‌గా.. దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు పుష్ప‌కు.‌