నటుడు అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

యువతిని దూషించిన కేసులో బుల్లితెర నటుడు అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ తనను దూషించాడంటూ ఒక యువతి రెండు వారాల క్రితం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. తాజాగా అమర్‌ను అరెస్ట్ చేశాడు. అతడికి కూకట్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

amar arrest

మణికొండలో బొటెక్ వ్యాపారంకు సంబంధించి ముగ్గురు యువతులకు గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో ఒక యువతికి మద్దతుగా ఉన్న అమర్.. ఒక యువతిని దూషించాడు. దీంతో ఆ యువతి తనను దూషించాడంటూ అమర్‌పై కేసు పెట్టింది.