మెగా హీరో సినిమాలో దగ్గుబాటి రానా స్పెషల్ రోల్

బాహుబలి విలన్ రానా దగ్గుబాటి ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుందని చెప్పవచ్చు. రెమ్యునరేషన్ కూడా పెద్దగా పట్టించుకోకుండా అప్పుడప్పుడు మంచి గెస్ట్ రోల్స్ కూడా చేస్తుంటాడు. ఇప్పటికే సాయి పల్లవి మెయిన్ లీడ్ లో నటిస్తున్న విరాటపర్వం సినిమాలో రానా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే ఒక యువ హీరో సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ టాలెంటేడ్ హీరో అప్పుడే క్రిష్ దర్శకత్వంలో రెండవ సినిమాను కూడా పట్టాలెక్కించాడు. అయితే ఆ కొత్త సినిమాలో రానా కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడట. ఇంటర్వెల్ అనంతరం కథను మలుపు తిప్పే పాత్రలో రానా ఊహించని పాత్రలో దర్శనమిస్తాడాని టాక్. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.