నా కల నిజమవుతోంది.. అమితాబ్ పై ప్రభాస్ కామెంట్

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుకు ముందే తన సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని వదులుతున్నాడు. నేడు వైజయంతి ప్రొడక్షన్ ప్రభాస్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ ఒక వివరణ ఇచ్చాడు.

ఇన్నాళ్ళకు నా కల నెరవేరుతోందని, అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోనోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రభాస్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. ఇక ఆ పాత్ర కేవలం గేస్ట్ రోల్ కోసమే అంటూ రూమర్స్ రాగా దర్శకుడు నాగ్ అశ్విన్ వెంటనే క్లారిటీ ఇచ్చాడు. ఆయన సినిమా మొత్తం ఉంటారని చెబుతూ.. అది గెస్ట్ రోల్ కాదు. సినిమాలో చాలా కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు సరికొత్తగా కనిపించబోతున్నారని అన్నారు. అదే విదంగా సినిమాకు మొదట ఆయన క్యారెక్టర్ పేరునే వర్కింగ్ టైటిల్ గా సెట్ చేసినట్లు చెబుతూ తప్పకుండా ఆయన ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని కూడా నాగ్ అశ్విన్ తెలిపారు.