పవన్ షూటింగ్‌లో రానా

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగులోకి రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తుండగా.. దగ్గుబాటి రానా కీలక పాత్రలలో నటించనున్నాడు. పవన్-రానా కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సాగర్ కె.చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభమవ్వగా.. పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నాడు.

RANA ATTEND PAWAN SHOOTING

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో రానా పాల్గొన్నట్లు మేకర్స్ ప్రకటించారు. పవన్, రానా మధ్య కొన్ని యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ సినిమా రాబోతోంది. సాయిపల్లవి, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించనున్నారు.