ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా రమ్యకృష్ణ?

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతుండగా.. రాత్రిపూట చలిలో షూటింగ్ చేస్తున్నట్లు ఇటీవల RRR సినిమా యూనిట్ ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇందులో యూనిట్‌తో పాటు తారక్‌,రాజమౌళి చలిమంట కాల్చుకుంటూ కనిపించారు.

RAMYAKRISHNA

RRR పూర్తైన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న సినిమాలో ఎన్టీఆర్ నటించనుండగా… ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నటీనటులను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్‌ రమ్యకృష్ణతో పవర్ ఫుల్ రోల్ చేయించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇందులో లేడీ విలన్‌గా ఆమె కనిపించనుందట.

ఎస్‌ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు.