Mega Powerstar: అభిమానిని స‌ర్‌ప్రైజ్ చేసిన రాంచ‌ర‌ణ్..

Mega Powerstar: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిరుత చిత్రంలో చెర్రీ న‌టించి.. మంచి విజ‌యాన్ని అందుకున్నాడు.. తొలి సినిమాతోనే క‌మ‌ర్షియ‌ల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌గ‌ధీర చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్. ఇప్పుడు ప్ర‌స్తుతం ఆయ‌న మ‌రోసారి రాజ‌మౌళితో జ‌త క‌ట్టారు.. ఈ సారి బాక్సాఫీస్‌ను షేక్ చేసే కాంబో ఈ చిత్రం.. అదేనండీ ఆర్ఆర్ఆర్.. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌స్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఇక ఇదిలా ఉంచితే..రాంచ‌ర‌ణ్‌కు భారీ ఎత్తున ఫ్యాన్ ఉంటార‌నే విష‌యం తెలిసిందే..

Ram charan

సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై అభిమానాన్ని చూపిస్తారు ఫ్యాన్స్‌. ఈ నేప‌థ్యంలోనే రేపు రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ అభిమాని సోష‌ల్ మీడియాలో ఒక రిక్వెస్ట్ పెట్టింది.. న‌మ‌స్కారం చ‌ర‌ణ్.. నేను మీకు పెద్ద ఫ్యాన్ మీ కోసం నేను ఒక డ్రీమ్ హౌస్ మోడ‌ల్‌ను త‌యారు చేశాను.. దీనిని మీకు ఇవ్వాల‌ని కోరిక‌గా ఉంది.. మీరు అనుమ‌తిస్తే మిమ్మ‌ల్ని క‌లిసి ఈ డ్రీమ్ హౌస్ మోడ‌ల్‌ను ఇస్తానంటూ అభిమాని శ్రీ‌మ‌తి సుద‌ర్శన్ బొడ్డు కోరింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న రాంచ‌రణ్ స్వ‌యంగా సుద‌ర్శ‌న్ బొడ్డు కుటుంబ‌స‌భ్యుల‌ను క‌లిసి వారు ఇచ్చిన బ‌హుమానంను స్వీకరించారు.. వారితో స‌ర‌దాగా మాట్లాడ‌డంతో పాటు ఫోటోలు దిగారు. దీంతో షూటింగ్‌ల‌తో బిజీగా ఉంటే స్టార్ త‌మ వంటి సామాన్య అభిమానుల‌కు కూడా క‌లిసే అవ‌కాశం ఇవ్వ‌డం చాలా సంతోషంగా ఉందంటూ సుద‌ర్శ‌న్ బొడ్డు ఫ్యామిలీ ఆనందం వ్య‌క్తం చేసింది.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.‌