RRR: రేపు రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే.. నేడు ఆర్ఆర్ఆర్ నుంచి స‌ర్‌ప్రైజ్!

RRR: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో కొమురం భీంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పోషిస్తుండ‌డంతో సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కాగా రేపు మార్చి 27న రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. నేడు సాయంత్రం 4గంట‌ల‌కు ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం ట్రీట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది.

RRR Ramcharan

RRR రామ‌రాజు లుక్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. అలాగే తాజాగా మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ రాంచ‌ర‌ణ్‌కు (ఆర్ఆర్ఆర్) సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో నిప్పుల మ‌ధ్య‌లో నుంచి గుర్రంపై వ‌స్తూ క‌నిపిస్తాడు రాంచ‌ర‌ణ్. ఇదిలా ఉంచితే ఇందులో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా పోషిస్తున్న విష‌యం తెలిసిందే. RRR రాంచ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ సీత పాత్ర‌ను చేస్తుంది.‌‌