Tollywood: కొత్త‌ హీరోహీరోయిన్ల‌తో ర‌క్క‌సి చిత్రం.. క్లాప్ కొట్టిన ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌స‌న్నకుమార్‌!

Tollywood: ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నూత‌న క‌థానాయ‌కుల‌తో ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ర‌క్క‌సీ చిత్రం ఘ‌నంగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ చిత్రానికి సాగ‌ర్ క్లాప్ కొట్ట‌గా ప్ర‌ముఖ నిర్మాత ప్ర‌శ‌న్న‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. వీర‌శంక‌ర్ ఈ చిత్రానికి గౌర‌వ‌ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో చిత్ర నిర్మాత మాయా మాట్లాడుతూ… ఎ 7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. ద‌ర్శ‌కుడు అభిఅన్న‌య్య నా మేన‌ల్లుడు. నేను అత‌నిలోని టాలెంట్ ని గుర్తించి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాను. మా చిత్రానికి మీ అంద‌రి ఆద‌రాభిమానాలు కావాలి.

new movie

Tollywood మా చిత్రంలో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరున నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. Tollywood ఈ చిత్ర నిర్మాత ప్ర‌భ నాయుడు మాట్లాడుతూ… ఎ7 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మాది మొద‌టి చిత్రం. మీరంద‌రి స‌పోర్ట్ త‌ప్ప‌కుండా మా చిత్రానికి ఉండాల‌ని కోరుకుంటున్నాను. ర‌క్క‌సి అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డ్ర‌గ్స్ బ్యాక్ డ్రాప్ లో Tollywood ఈ చిత్ర క‌థాంశం ఉండ‌బోతుంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ఎట్లాంటి వాతావ‌ర‌ణంలో పెంచుతున్నారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంది. మా మూవీలో ఇంకా ఎంతో మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. త‌రువాత మేము నిధాన‌ముగా ఒకొక్క‌టి రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము అన్నారు. హీరో విక్కీ మాట్లాడుతూ… నేను ఒక డెబ్యూ హీరో. మా డైరెక్ట‌ర్‌ అన్న‌య అభి, డిఒపి జ‌గ‌న్‌, హీరోయిన్ సిమ్ర‌త్‌. మేమంతా ఈ చిత్రం కోసం ముందు ముందు బాగా క‌ష్ట‌ప‌డి మంచి అవుట్ పుట్ తీసుకువ‌స్తామ‌ని అన్నారు. ఇందులో హీరోయిన్‌గా సిమ్ర‌త్ న‌టిస్తున్నారు. ద‌ర్శ‌‌కుడు అభి అన్న‌య్య మాట్లాడుతూ… ముందుగా న‌న్ను న‌మ్మి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మా సినిమాలో ఇంకా చాలా మంది పెద్ద యాక్ట‌ర్స్ ఉన్నారు. మేము నిధానంగా పోస్ట‌ర్ రూపంలో ఒకొక్క‌రిని రివీల్ చెయ్యాల‌నుకుంటున్నాము. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ని పెట్టాల‌ని చూస్తున్నాము అన్నారు. Tollywood ఇక ఈ చిత్రానికి ఆర్.ఆర్. ష‌కీల్ సంగీతం అందిస్తున్నారు.