ట్రెండింగ్‌లో నితిన్ చెక్ ట్రైలర్

హీరో నితిన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గత ఏడాది భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్.. ప్రస్తుతం చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్‌గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు నాలుగు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించగా.. రెండు లక్షలకుపైగా లైక్స్ సాధించింది.

nitin check trailer trending

రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లుగా నటించగా.. చంద్రశేఖర్ యేలేటి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సంపత్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రలలో నటించారు.