Tollywood: మాధ‌వీల‌త‌పై అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు.. సీపీ స‌జ్జ‌నార్‌కు ఫిర్యాదు!

Tollywood: సినీ న‌టి, భాజ‌పా నేత మాధ‌వీల‌తపై సోష‌ల్ మీడియాలో కొంద‌రు వ్య‌క్తిగ‌తంగా అస‌భ్య పోస్టులు పెడుతూ వ్య‌క్తిగ‌తంగా దూషిస్తున్నారు. ఈ విష‌యంపై మాధ‌వీల‌త గురువారం సీపీ స‌జ్జ‌నార్‌ను క‌లిసి ఫిర్యాదు చేసింది. ఆ నిందితుల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఓ వ‌ర్గం న‌న్ను కావ‌ల‌నే టార్గెట్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెడుతోంది.

madhavilatha meets sajjanar

ఏదైనా కేసులో ఆడ‌వాళ్లు అరెస్ట్ అయితే అందులో నేను కూడా ఉన్న‌ట్టు ప్ర‌చారం చేస్తున్నారు. ఇలాంటి దారుణాల‌పై ఇప్ప‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియాలో యుద్ధం చేశా.. అయితే త‌న‌పై ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం మాన‌సికంగా న‌న్ను మ‌రింత కుంగ‌దీస్తోంది. అందుకే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాను. ఇలాంటి అభ్యంత‌ర‌క‌ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకువాల‌ని పోలీసుల‌ను కోరాను అంటూ మాధ‌వీల‌త పేర్కొందిTollywood.