జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ పాపులర్ సినిమాకు 14 ఏళ్లు

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తన నటన, డ్యాన్స్, డైలాగ్స్‌లతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన మార్క్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఎన్టీఆర్ కెరీర్‌లో రాఖీ సినిమా ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎంతోమంది అమ్మాయిల మనస్సులను కూడా గెలుచుకున్నాడు. అప్పటివరకు మాస్ హీరోగానే ఉన్న తారక్.. ఈ సినిమాతో క్లాస్ హీరోగా కూడా మారాడు. ఇందులో ఎన్టీఆర్ నటన, ఎమోషనల్ సీన్లు హైలెట్‌గా నిలిచాయి.

rakhi

ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకంటే.. నేటితో ఈ సినిమా విడుదలై సరిగ్గా 14 ఏళ్లు అయింది. 2006లో డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలై రికార్డులు సృష్టించింది. మహిళల భద్రతపై సామాజిక అంశాలతో ఈ సినిమాను కృష్ణవంశీ అద్భుతంగా తెరకెక్కించగా.. ఇలియానా, చార్మీ , సుహసిని కీలక పాత్రలలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో ఈ సినిమాకు మెరుగులు దిద్దగా.. సిరివెన్నెల, చంద్రబోస్, శ్రీకాంత్ అద్దాల రాసిన పాటలు సమాజంలోని మహిళ సమస్యల గురించి తెలియజేశాయి.

కె.ఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇందులోని ఎన్టీఆర్ ఎమోషనల్ సీన్లు చూస్తే ప్రతిఒక్కరికి కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. అంతగా ఈ సినిమాలో తన నటనతో ఎన్టీఆర్ మైమరిపించాడు. క్లైమాక్స్‌లో కోర్టు సీన్‌ ఈ సినిమాలో హైలెట్ అని చెప్పవచ్చు. ఈ కోర్టు సీన్‌లో ఎన్టీఆర్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ అమెజింగ్‌గా ఉంటాయి. రాఖీ విడుదలై 14 ఏళ్లు కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్‌లో #14YearsForRakhi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.