Tollywood: చార్లీ చాప్లిన్ సినిమాలు చూసే ఇండ‌స్ట్రీకి వ‌చ్చా: రాజేంద్ర‌ప్ర‌సాద్

Tollywood: న‌ట‌కీరీటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం క్లైమాక్స్‌. ఈ చిత్రానికి భ‌వ‌నీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.. ఇటీవ‌లే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. నేను దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని.. Tollywood ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌డానికంటే ముందే మ‌ద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్ష‌ణ తీసుకున్నాను.

Rajendraprasad latest

అక్క‌డ గోల్డ్ మెడ‌ల్ సాధించాను. అయితే అప్ప‌టికే టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఏలుతున్న ఎన్టీఆర్‌, ఏయ‌న్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, ఇలా ఎంతో మంది అగ్ర‌హీరోలు ఉన్నారు. కాబ‌ట్టి ఇండ‌స్ట్రీలో రాణించాలంటే ఏవిధంగా న‌టించాలి అని అనుకున్న‌ప్పుడు.. అప్పుడు నాకొక సందేహం క‌లిగింది.. ఓ సారి చార్లి చాప్లీన్ సినిమాలు చూశా.. దీంతో కామెడీ డ్రామా కథ‌ల‌తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అలా మీ ముందు కామెడీ హీరోగా Tollywood క‌నిపిస్తున్నాను అని చెప్పుకొచ్చారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌.