మరో 40 రోజుల్లో విడిపోనున్న చరణ్ ఎన్టీఆర్…

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్. చరణ్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ భారి మల్టిస్టారర్ సినిమాలో బాలీవుడ్ బిగ్గీ అజయ్ దేవగన్, స్టార్ హీరోయిన్ అలియా భట్ యాక్ట్ చేస్తున్నారు. కరోనా రాకుంటే ఈ పాటికి బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిన ఈ ఆర్ ఆర్ ఆర్ కోసం వరల్డ్ వైడ్ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ని రాజమౌళి సారధి స్టూడియో స్టార్ట్ చేశాడు. మొన్న చరణ్ హాజరైన ఈ షూటింగ్ కి నిన్నటి నుంచి ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. చరణ్ అండ్ ఎన్టీఆర్ పైన రాజమౌళి విజువల్ వండర్ లా ఉండబోయే సాంగ్ ని షూట్ చేయబోతున్నాడట. దాదాపు 8 నిమిషాల నిడివితో ఈ పాట ఉండబోతుందట. మెయిన్ స్టార్ కాస్ట్ ఉండబోయే ఈ షెడ్యూల్ లోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవనుంది.

Ramaraju For Bheem - Bheem Intro - RRR (Telugu) | NTR, Ram Charan, Ajay Devgn, Alia | SS Rajamouli

దాదాపు 40 రోజుల పాటు ఏక ధాటిగా జరగనున్న ఈ షెడ్యూల్ లో మరో వారం రోజుల్లో అలియా భట్ కూడా జాయిన్ అవనుంది. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండడంతో రాజమౌళి వీలైనంత త్వరగా అనుకున్న టైం లోపలే షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తే కరోనా థర్డ్ వేవ్ వచ్చినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు హ్యాపీగా చేసుకోవచ్చు అనే ప్లాన్ లో ఉన్నాడట. సో మరో 40 రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. దీంతో దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా కోసం కలిసి పని చేస్తున్న చరణ్ ఎన్టీఆర్ విడిపోనున్నారు. షూటింగ్ అయిపోగానే ఎవరి ప్రాజెక్ట్స్ పనిలో వాళ్లు పడతారు. మళ్లీ ఈ ఇద్దరు స్టార్ హీరోలని కలిపి చూసేది ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ లోనే.