ఈ టైంలో అల్లు అర్జున్ ఆ సాహసం మంచిదేనా?

ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. స్మగ్లింగ్ నేపధ్యంలో రెండు భాగాలుగా రానున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలున్నాయి. పుష్ప సిరీస్ లో ఫస్ట్ పార్ట్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. రెండో పార్ట్ షూటింగ్ కి దాదాపు ఏడాది గ్యాప్ ఇచ్చి తెరకెక్కించాలని సుకుమార్ భావిస్తున్నాడు. ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ ఐకాన్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. వకీల్ సాబ్ తో సాలిడ్ హిట్ ఇచ్చిన శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్ స్క్రిప్ట్ వెర్షన్ ని రెడీ చేస్తునున్నారట. గోవాలో జరగనున్న షెడ్యూల్ అవగానే పుష్ప పార్ట్ 1 పనులు దాదాపు అయిపోతాయి.

కాస్త గ్యాప్ తీసుకోని అల్లు అర్జున్ ఐకాన్ ని మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే చే గెవేరా మోటార్ సైకిల్ డైరీస్ ప్యాటర్న్ లో ఐకాన్ మూవీ బైక్ ట్రావెల్ చుట్టూ తిరిగే కథ అని కొంతమంది అనుకుంటుండగా… మరి కొంతమంది మాత్రం ఐకాన్ సినిమాలో అల్లు అర్జున్ బ్లైండ్ రోల్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. మొదటి వార్త నిజం అయితే అల్లు అర్జున్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా చూడడం గ్యారెంటి కానీ రెండో రూమర్ నిజం అయితే మాత్రం అల్లు అర్జున్ ఒక సాహసం చేస్తున్నట్లే. బన్నీ హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న ఇలాంటి టైంలో అంధుడిగా కనిపించాలనే ఆలోచన చాలా డేరింగ్ స్టెప్ అనే అనుకోవాలి. మరి అల్లు అర్జున్ అలాంటి డేర్ చేస్తాడా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.