ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కె.రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాహో సినిమా హిందీలో సూపర్ హిట్ కాగా.. తెలుగులో మాత్రం అలరించలేకపోయింది. దీంతో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను ఫాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకి సంబంధించి ఒక వార్త ట్రెండింగ్‌గా మారింది.

Radhe Shyam Release Date
Radhe Shyam Release Date

రాధేశ్యామ్ టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘త్వరలో రాధేశ్యామ్ టీజర్ మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు ఓపికపట్టండి. మీ నిరీక్షణ ఒక మిలియన్ చిరునవ్వుల విలువైనదని నేను హామీ ఇస్తున్నాను’ అని రాధాకృష్ణకుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో డార్లింగ్ అభిమానులు దీని కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా..యు.వి.కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్ టీజర్ న్యూ ఇయర్ కానుకగా విడుదల అవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ విడుదల కాకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు… టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పాలని ట్విట్టర్‌లో దర్శక, నిర్మాతలను కోరుతున్నారు. దీంతో రాధాకృష్ణకుమార్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను కూల్ చేసేందుకు ఈ మేరకు ట్వీట్ చేశారు.