సోనూసూద్ హీరోగా సినిమా

ఇప్పటివరకు విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు సోనూసూద్.. ఇప్పుడు ప్రధాన నటుడిగా మారాడు. సోనూసూద్ ప్రధాన పాత్రలో ‘కిసాన్’ అనే సినిమా బాలీవుడ్‌లో తెరకెక్కనుంది. ఇ.నివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. డ్రిమ్ గర్ల్ సినిమా దర్శకుడు రాజ్ శాండిల్యా దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలో నటీనటుల ఎంపిక జరగనుంది.

SONUSOOD KISAN MOVIE
SONUSOOD KISAN MOVIE

సోనూసూద్ ప్రధాన పాత్రలో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడంతో.. దీనిపై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సోనూసూద్‌కి పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో సోనూసూద్‌కి బిగ్‌బి అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. కిసాన్ సినిమా బృందం, డైరెక్టర్ నివాస్, సోనూసూద్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నానని అమితాబ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటించాడు. సంక్రాంతికి అల్లుడు అదుర్స్ సినిమా విడుదల కానుంది.