‘జెంటిల్ మెన్’ సినిమాకు సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్!!

దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ 1993లో సోషల్ డ్రామాగా తెరకెక్కించిన జెంటిల్ మెన్ సినిమా ద్వారా తొలిసారిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అర్జున్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ మ్యూజికల్ హిట్. ఇక 27 సంవత్సరాల తరువాత ఆ ట్రెండ్ సెట్టర్ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని చిత్ర నిర్మాత కెటి కుంజుమోన్ ప్రకటించారు.

కుంజుమోన్ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు, జెంటిల్ మెన్ సీక్వెల్ పాన్-ఇండియన్ మూవీగా రానుంది, ఈ చిత్రం నాలుగు దక్షిణ భారత భాషలలో మరియు హిందీలో విడుదల కానుందని ప్రకటించారు. అయితే ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
జెంటిల్ మెన్ వినిమా అవినీతి విద్యావ్యవస్థను నిర్ములించడానికి ఒక దొంగగా మారిన హీరో ఎలాంటి అడుగులు వేస్తుండనే కాన్సెప్ట్ అప్పట్లో అందరిని ఆకట్టుకుంది. AR రెహమాన్ సంగీతం అప్పట్లో సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసింది.