గుండూబాస్ గా ‘మెగాస్టార్’.. హెయిర్ స్టైల్ లేకపోయినా ‘కిర్రాక్’ లుక్!!

మెగాస్టార్ చిరంజీవి అంటే మెయిన్ గా అందరికి నచ్చేది అయన స్టైల్. చిరునవ్వుతో పాటు ఆయన హెయిర్ స్టైల్ కూడా అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఇప్పుడు సడన్ షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇప్పుడు గుండూ బాస్ అయ్యారు. అసలు ఏ మాత్రం వెంట్రుకలు లేకుండా క్లీన్ గా గుండుతో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేను మాంక్ స్టైల్ లో ఉన్ననా అంటూ మెగాస్టార్ ఇన్స్టాగ్రామ్ లో ఈ న్యూ లుక్ ని పోస్ట్ చేశారు. ఇక గాగుల్స్ కిర్రాక్ ఉన్నాయని మరోవైపు అభిమానులు కామెంట్ చేస్తుండగా
రామ్ చరణ్ కూడా ఈ న్యూ లుక్ పై షాకేయ్యే విధంగా కామెంట్స్ చేశారు. అప్పా నేను ఏమి చూశాను అంటూ లుక్ ఫైరింగ్ లో ఉందని వివరణ ఇచ్చాడు. ఇక ఈ లుక్ భవిష్యత్తులో ఒక ప్రాజెక్టు కోసమని తెలుస్తోంది. టెస్ట్ లుక్ కోసమే మెగాస్టార్ ఈ విధంగా కొత్తగా కనిపిస్తున్నట్లు టాక్. ఆచార్య అనంతరం మెగాస్టార్ బాబీ, మెహర్ రమేష్ లతో వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. మరి ఈ లుక్ ఎవరికోసమే తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.