అటువంటి చట్టాలు వస్తేనే సినిమా బ్రతుకుంది : నిర్మాత దిల్ రాజు

దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ముఖ్య పాత్రలలో నటిస్తూ వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఇటీవలే ఈ సినిమా విడుదల అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే సోషల్ మీడియా లో ఈ సినిమా పై విపరీతమైన గెజిటివిటీ వ్యాప్తి చెందుతుంది అంటూ దిల్ రాజు అసహనం వ్యక్తం చేసారు. ఇటువంటి నెగిటివ్ ప్రచారం సినిమా ఇండస్ట్రీ కి ఏ మాత్రం మంచిది కాదు అని ఆయన అన్నారు.
ఇటీవలే కేరళ కోర్ట్ రివ్యూల విష్యంలో ఓ తీర్పు ఇచ్చినట్లు, అదే చట్టం ఇక్కడ కూడా వస్తే కానీ సినిమాలు బ్రతకవు అన్నారు. ఆ చట్ట ప్రకారం సినిమా విడుదల జరిగిన 3 రోజులు వరుకు రివ్యూలు రాయకూడదు అని న్యాయస్థానం వెల్లడించింది. అదే చట్టం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తీసుకుని రావాలి అన్నారు నిర్మాత దిల్ రాజు.