కాజల్, రెజీనా నటించిన కామెడీ హారర్ ‘కాజల్ కార్తీక’ ఆహా లో స్ట్రీమ్ కాబోతుంది

కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలో నటిస్తూ వస్తున్న చిత్రం కాజల్ కార్తిక. ఈ సినిమాకి DK రచయిత ఇంకా దర్శకత్వం నిర్వహించగా పదార్తి పద్మజ నిర్మించారు. జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు వివిధ పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ గా, ప్రసాద్. ఎస్. ఎన్. మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా లో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. కామెడీ, హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాలో . 5 వేర్వేరు కథలతో కాజల్ కి రెజీనాకి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలతో మొదలవుతుంది. ట్రైలర్ చూస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. ఏప్రిల్ 9న ‘కాజల్ కార్తీక’ హనుమాన్ మీడియా ద్వారా ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది.