హాట్ బికినీలో రెచ్చిపోతున్న హీరోయిన్

ఇటీవల హీరోయిన్స్ బికినీలతో రెచ్చిపోతున్నారు. టాలీవుడ్ హీరోయిన్స్ దగ్గర నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ వరకు ప్రతిఒక్కరూ బికినీల్లో ఫొటోలు పెడుతూ కుర్రకారును రెచ్చగొడుతున్నారు. ఇటీవలే పలువురు హీరోయిన్లు మాల్ధీవుల్లో బికినీలతో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మాల్ధీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ బికినీలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

priya benjarji

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రియా బెనర్జీ బికినీలో కుర్రకారుని హీటెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల హాట్ ఫొటోస్‌ని పోస్ట్ చేసింది. తాజాగా హాట్ హాట్ బికినీలో ఆమె పోస్ట్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ అడివి శేష్ పక్కన కిస్ అనే సినిమాలో ప్రియా బెనర్జీ నటించింది. ఆ తర్వాత సందీప్ కిషన్‌కు జోడీగా జోరు సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా వచ్చిన అసుర సినిమాలో కూడా ఈ భామ నటించింది. అయితే ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు.

దీంతో టాలీవుడ్‌తో వదిలేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం హిందీతో పాటు తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. అలాగే 8 హవర్స్ అనే తెలుగు వెబ్‌సిరీస్‌తో పాటు హిందీలో జామై 2.0 అనే వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.