బిగ్‌బాస్-4 విన్నర్‌కి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

బిగ్‌బాస్-4 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. కంటెసెంట్లు అందరూ టైటిల్‌ను గెలుచుకునేందుకు స్ట్రాంగ్‌గా ఆడుతున్నారు. ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్స్ అన్నీ పక్కనపెట్టి కంటెస్టెంట్లు అందరూ గేమ్‌పై ఫోకస్ పెట్టారు. టాస్క్‌లు కూడా బాగానే ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అయితే మరికొద్దిరోజుల్లో షో ముగియడంతో విన్నర్, రన్నర్ ఎవరు అవుతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అభిజిత్ విన్నర్ అవుతాడని, అఖిల్ రన్నర్ అవుతాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు.

bigboss

అభిజిత్, మోనాల్, అఖిల్, సోహైల్, అరియానా, హరిక ఉండగా.. ఈ వారం నామినేషన్స్‌లో అఖిల్ మినహా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే ఫైనల్ వీక్‌కు ఇక ఐదుగురు మాత్రమే మిగలనున్నారు. ఈ ఐదుగురు ఫైనల్ పోరులో తలపడనున్నారు. అయితే బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన వారికి ప్రైజ్‌మనీ ఎంత ఉంటుందని అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. గెలిచిన వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇస్తారని తెలుస్తోంది.

గత సీజన్‌లో బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ రూ.50 లక్షలు ప్రైజ్‌మనీ అందుకోగా.. ఈ సారి ప్రైజ్‌మనీ తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ సారి 40 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో 9.80 లక్షల రూపాయలు ట్యాక్స్‌ల కింద కట్ చేస్తారు. దీంతో చేతికి 30 లక్షల రూపాయలు మాత్రమే రానున్నాయి.