గూగుల్‌లో టాప్ వెబ్‌సిరీస్‌లు ఇవే

కొత్త ఏడాది ముగియనుండటంతో.. ఈ ఏడాది ట్రెండింగ్ అయిన వివరాలను గూగుల్ వెల్లడించింది. ఈ ఏడాది లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇక చాలా వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదల అయ్యాయి. తాజాగా ఎక్కువ పాపులర్ అయిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన వివరాలను గూగుల్ వెల్లడించింది. ఇందులో మిర్జాపూర్ వెబ్‌సిరీస్ తొలి స్థానంలో ఉండగా.. కేవలం హిందీలోనే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా దీని కోసం వెతికినట్లు గూగుల్ తెలిపింది.

mirzapur

ఇక మీర్జాపూర్ సూపర్ హిట్ కావడంతో మిర్జాపూర్ 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో మీర్జాపూర్ 2 గురించి ఎక్కువమంది సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. ఆ తర్వాత మనీ హీస్ట్, స్కామ్ 1992 వంటి వెబ్‌సిరీస్‌ల కోసం సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌లను లాక్‌డౌన్‌లో ఎక్కువమంది చూశారని తెలిపింది.

అయితే త్వరలో తెలుగులోకి మీర్జాపూర్ 2 డబ్ అవ్వనుంది. మీర్జాపూర్ హిందీతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోకి డబ్ అవ్వగా… మీర్జాపూర్ 2 అవ్వలేదు. ఒక హిందీలో మాత్రం మీర్జాపూర్ 2 విడుదల అయింది. దీంతో త్వరలోనే అన్ని భాషల్లోకి మీర్జాపూర్ 2ను డబ్ చేయనున్నారు.