Tollywood: బాలకృష్ణ స‌ర్ ప‌వ‌ర్ ఫుల్ మ్యాన్‌: న‌టి ప్ర‌గ్యాజైస్వాల్

Tollywood: నంద‌మూరి బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌కృష్ణ‌కు జోడీగా ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఈ Tollywood సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల‌ తాజాగా స్పందించింది ప్ర‌గ్యా జైస్వాల్‌. బాల‌కృష్ణ స‌ర్ ప‌వ‌ర్ ఫుల్ మ్యాన్‌.. ఆయ‌న స్ర్కీన్ షేర్ చేసుకోవ‌డం ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయ‌న ఎన‌ర్జీ లెవెల్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమా ప‌ట్ల ఆయ‌న‌కున్న అభిరుచికి ఎవ‌రూ సాటిరారు.

pragya jaiswal

ఇక డైరెక్ట‌ర్ బోయ‌పాటి గురించి చెప్పాలంటే.. గ‌తంలో బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో జ‌య జాన‌కి నాయ‌క Tollywood చిత్రంలో న‌టించాను. ఇప్పుడు ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం సుల‌భంగా అనిపిస్తోంది.. క‌థ ప‌ట్ల ద‌ర్శ‌కుడికి ఉన్న విజ‌న్, స్ప‌ష్ట‌త ఎంతో స్ఫూర్తి దాయ‌క‌మైంది.. న‌టీన‌టులు, ఇత‌ర చిత్ర‌బృందం మ‌రింత శ్ర‌మించే విధంగా ప్ర‌తిరోజూ ఆయ‌న మ‌మ్మ‌ల్ని ప్రేరేపిస్తున్నారు. అలాగే క‌రోనా ప‌రిస్థితుల త‌ర్వాత తాను న‌టిస్తున్న మొద‌టిTollywood చిత్ర‌మిదే.. నాకెంతో స్పెష‌ల్‌.. అలాగే న‌టిగా నా క‌ల‌ల్ని సాకారం చేసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ తెలిపింది ప్ర‌గ్యాజైస్వాల్‌.