“నారప్ప” విడుదల చేసిన “నరసింహపురం”టీజర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్!!

 అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైన తమ "నరసింహపురం" టీజర్ కు బ్రహ్మండమైన స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేస్తోంది చిత్రబృందం. వెంకటేష్ గారి మంచితనాన్ని ఎప్పటికీ మరువలేమని, ఆయన తాజా చిత్రం "నారప్ప" తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డులు తిరగరాయాలని నరసింహస్వామిని  ప్రార్ధిస్తామని వారు ఈసందర్భంగా తెలిపారు.
గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై..  పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం'. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ అతి త్వరలో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
 కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా!!