ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్ ఎవరంటే

సందీప్ రెడ్డి వంగా అనే పేరు వినగానే బాలీవుడ్ లో కూడా ఓ మార్క్ పడిపోయేలా చేసిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి తర్వాత సినిమా ప్రభాస్ తో స్పిరిట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే యానిమల్ సినిమా చూశాక సందీప్ రెడ్డి ప్రభాస్ ను ఏ విధంగా చూపిస్తాడు అనే ఉత్సాహం ప్రేక్షకులలో అభిమానులు పెరిగిపోతూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రిప్రొడక్షన్ వర్క్స్ సందీప్ రెడ్డి మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ముగ్గురు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రష్మిక మందన్, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సందీప్ రెడ్డివంగా రష్మికను తన సినిమా ఆనిమల్లో హీరోయిన్గా చూపించడం జరిగింది. అయితే స్పీడ్ సినిమాకి సమీప రెడ్డి ఎవరిని హీరోయిన్గా తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.