ప్రభాస్ రాధేశ్యామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అసలు కథ ఇదే!

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో ఆడియెన్స్ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయాడు. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని రాధేశ్యామ్ తో రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియెన్స్ కి ఎంతగానో నచ్చింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా కాన్సెప్ట్ పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమా జ్యోతిష్యం, సైన్స్ అనే రెండు డిఫరెంట్ జానర్స్ లో కొనసాగుతుందట. సచిన్ కేడెకర్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ఇక ప్రభాస్ ఫ్యూచర్ ని ముందే ఉహీంచే వ్యక్తిగా కనిపించబోతున్నాడట. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన విక్రమాదిత్య ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో లుక్ ఎలా ఉంటుందా అని ఆడియెన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే రోల్ కూడా చాలా కీలకమని టాక్. ఇక ఇటీవల ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్టు కోసం జస్టిన్ ప్రభాకరన్ ని సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.