Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ గుడ్‌న్యూస్‌.. వ‌కీల్‌సాబ్ నుంచి తాజా అప్‌డేట్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.. దీంతో అభిమానులే కాకుండా ప్రేక్ష‌కులు కూడా ఈ చిత్రం కోసం ఎంతాగానో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ పింక్ చిత్రానికి ఇది రీమేక్‌గా వ‌స్తుంది.. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, మ‌గువా మ‌గువా సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.. త‌మ అభిమాన హీరో Powerstarరీఎంట్రీ ఇస్తున్న మూవీ తెర‌పై చూడాల‌ని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఒక్క సాంగ్ రిలీజ్ చేసిన.. తాజాగా మ‌రో సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర‌బృందం.

vakeelsaab

రేపు సాయంత్రం 5గంట‌ల‌కు వ‌కీల్‌సాబ్ చిత్రంలోని స‌త్య‌మేవ జ‌య‌తే అనే లిరిక‌ల్ వీడియో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించింది. ఇక ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఈ చిత్రంలో Powerstarప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ భార్య పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే అంజ‌లి, నివేథా థామ‌స్‌, అన‌న్య నాగేళ్ల ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.