Krrish Movie: ప‌వ‌ర్‌స్టార్‌తో న‌టించ‌డం నా క‌ల నిజ‌మైంది: నిధి అగ‌ర్వాల్

Krrish Movie: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్, క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న యంగ్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ఎంపిక చేశారు చిత్ర‌బృందం. దీంతో నిధి అగ‌ర్వాల్ ఆనందం వ్య‌క్తం చేశారు.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ గారితో న‌టించే అవ‌కాశం ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని అనుకోలేదు. నాకైతే ఎంతో ఆనందంగా ఉందని.. నా క‌ల నిజ‌మైన‌ట్టు భావిస్తున్నాను అని తెలిపింది నిధి అగ‌ర్వాల్‌..

powerstar with nidhi

అలాగే ఈ సినిమా నాకు 9వ చిత్రంగా వ‌స్తుంద‌ని.. Krrish Movie ఈ చిత్రం నా కెరీర్లో గోల్డెన్ ఫిలింగా నిలిచిపోతుంది అంటూ నిధి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఇకKrrish Movie ఈ చిత్రం షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లోని ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. నిధి అగ‌ర్వాల్ ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న‌ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏఎం ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణీ Krrish Movie ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నాడు. తొలిసారి ప‌వ‌న్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు కీర‌వాణీ గారు.