ఆ టాలీవుడ్ సీనియర్ హీరోను కలిసేందుకు 200 కి.మీ నడిచాడు

స్టార్ హీరోలకు పెద్ద ఎత్తున డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల అయితే చాలు.. ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. బ్యాన్సర్లు కట్టించి థియేటర్ల దగ్గర హంగామా చేస్తారు. ఇక మరికొంతమంది అయితే తమ అభిమాన హీరో కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఇటీవల తమ అభిమాన హీరోలను కలిసేందుకు చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్ తన ఇంటి నుంచి హైదరాబాద్‌కి నడుచుకుంటూ వస్తున్నారు.

venkatesh fan 200 kilometeres

ఇటీవలే స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా హీరో సాయిధరమ్ తేజ్‌లను కలిసేందుకు ఇద్దరు అభిమానులు తమ సొంత గ్రామం నుంచి హైదరాబాద్‌కి నడుచుకుంటూ వచ్చారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ను కలిసేందుకు తాండూర్ సమీపంలోని బుద్దారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ 200 కిలోమీటర్లు నడిచి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోకి చేరుకున్నాడు. అయితే వెంకటేష్‌ను కలిసేందుకు ప్రయత్నించగా.. వెంకటేష్ హైదరాబాద్‌లో లేకపోవడంతో కలవలేకపోయాడు. నారప్ప షూటింగ్ కోసం వెళ్లడంతో వెంకటేష్ హైదరాబాద్‌లో లేరు. దీంతో వెంకటేష్ వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని అభిమానికి రామానాయుడు స్టూడియో నిర్వాహకులు చెప్పారు.