తన క‌ల దీనితో నెర‌వేరిందన్న టాలీవుడ్ హీరోయిన్

పైసా వ‌సూల్ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై మొద‌టి సినిమాతోనే త‌న‌ అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది ముస్కాన్ సేథి. ప్ర‌స్తుతం అనురాగ్‌, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘రాధాకృష్ణ‌’.ప్ర‌ముఖ ద‌ర్శకుడుఢ‌మ‌రుకంఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 5న గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథీ ఇంట‌ర్వ్యూ..

HEROINE MUSKHAN SEDI INTERVIEW

‘శ్రీనివాస్ రెడ్డిగారిని రాధాకృష్ణ సినిమా కోసం క‌లిసిన‌ప్పుడు ఆయ‌న నా పాత్ర గురించి వివ‌రించారు. చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. సాంప్ర‌దాయ‌క‌మైన‌ తెలుగు అమ్మాయి పాత్ర‌. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో అంద‌మైన ప్రేమ‌కథ కూడా మిళిత‌మై ఉంటుంది. అలాగే మంచి సామాజిక సందేశం కూడా ఉంటుంది. సినిమాలో నాయ‌నమ్మ క‌ల‌ను నేరవేర్చ‌డానికి రాధ అనే అమ్మాయి ఏం చేసింద‌నేదే సినిమా. అంత‌రించిపోతున్న నిర్మ‌ల్ బొమ్మ‌ల ఆర్ట్‌ను ఎలా అభివృద్ధి చేసింది. గ్రామ ప్ర‌జ‌ల‌కు ఎలా సాయం చేసిందనేదే ప్ర‌ధానమైన క‌థ‌. సినిమా అంత‌టినీ నా భుజాల‌పై క్యారీ చేసే పాత్ర నాది. ఇలాంటి పాత్ర‌ను చేయ‌డం చాలా క‌ష్టం. ఇలాంటి పాత్ర ద‌క్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా డ్రీమ్ రోల్‌’ అని ముస్కాన్ సేథీ చెప్పింది.

‘సినిమాలో నా పాత్ర గ్రాఫ్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. పాట‌ల్లో డాన్సులు చేస్తూ సంతోషంగా ఉండే గ‌ర్ల్ నెక్ట్స్ పాత్ర కాదు. సినిమాను క్యారీ చేసే ఓ బ‌ల‌మైన పాత్ర‌. చాలా బ‌ల‌మైన డైలాగ్స్ ఉన్నాయి. మంచి ఎమోష‌న్స్ కూడా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డిగారు చిన్న ఎమోష‌న్ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కాలేదు. కొన్ని స‌న్నివేశాల కోసం ముప్పై, ముప్పై ఐదు టేకులు కూడా తీసుకున్న సంద‌ర్భాలున్నాయి. పెద్ద డైలాగ్స్ చెప్ప‌డ‌మే కాదు, ఆ డైలాగ్స్‌కు త‌గ్గ ఎమోషన్స్‌ను చూపించ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
విలేజ్ అమ్మాయి పాత్ర‌లో న‌టించ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. క‌థానుగుణంగా నేను నిర్మ‌ల్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో 45 రోజుల పాటు ఉండి షూటింగ్‌లో పాల్గొన్నాను. సిటీకి అల‌వాటుప‌డ్డ‌వాళ్ల‌కు అలా ఉండ‌టం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. డేడికేష‌న్‌తో ఎంటైర్ టీమ్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్ల‌నే అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగానంది

‘తెలుగులో ఇది నా మూడో సినిమా. మ‌రో సినిమా తనీశ్‌తో క‌లిసి న‌టించాను. త్వ‌ర‌లోనే అది కూడా విడుద‌లవుతుంది. ఇప్పుడు కొత్త క‌థ‌ల‌ను వింటున్నాను. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు తెలియ‌జేస్తాను. రాధాకృష్ణ రిలీజ్ త‌ర్వాత గ్యారెంటీగా నాకు మంచి పాత్ర‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్నాను అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు.