భీమ్ లా నాయక్ రిపోర్టింగ్ సర్…

పవర్ స్టార్ అభిమానులు అలెర్ట్ అయిపోండి… పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. వకీల్ సాబ్ తో క్లాస్ గా వాయించిన పవన్ కళ్యాణ్ ఈసారి మాస్ గా వాయించడానికి రెడీ అయ్యాడు. మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి బరిలో నిలబడనుంది. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయితేనే పండగ వాతావరణం ఉంటుంది అలాంటిది ఆయన సినిమా పండగకే వస్తే… కాసుల వర్షం కురవడం ఖాయం. భీమ్ లా నాయక్ రిపోర్టింగ్ దిస్ సంక్రాంతి అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. తమన్ అదిరిపోయేలా ఇచ్చిన మ్యూజిక్ కి బ్లూ షర్ట్ లో షూటింగ్ స్పాట్ కి ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఆయన ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్రేజేన్స్ తో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా ఖాకి బాటల్లో పవన్ కళ్యాణ్ కత్తిలా ఉన్నాడు. గబ్బర్ సింగ్ రోజులు గుర్తు చేస్తూ ఇప్పటికీ ఆ స్వాగ్ ని పవన్ కళ్యాణ్ అలానే మైంటైన్ చేస్తున్నాడు. 50 సెకండ్ల మేకింగ్ వీడియోలో రానా దగ్గుబాటి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా కనిపించారు. రానా కనిపించింది కాసేపే అయిన అతని కళ్ళలోని ఇంటన్సిటీ అట్రాక్ట్ చేస్తుంది. డైరెక్టర్ తో సహా దాదాపు క్రూ అంతా ఉన్న ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. గబ్బర్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఈ మేకింగ్ వీడియో గురించి చెప్పాలి అంటే… పవన్ కళ్యాణ్ అలియాస్ భీమ్ లా నాయక్ ప్రస్తుతం డ్యూటీలో ఉన్నాడు, సంక్రాంతికి రిపోర్ట్ చేస్తాడు. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ఆర్ ఛానెల్…