ఆగ‌స్ట్‌13న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న పూర్ణ‌, క‌ళ్యాణ్ జీ గోగ‌న, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ `సుందరి`

రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుద‌ల‌కి సిద్ద‌మైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‏లో నటిస్తున్న ‘సుంద‌రి` సినిమా ఆగ‌స్ట్‌13న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో న‌వ‌గ్ర‌హ కుండ‌లి ముందు పూర్ణ ఇంటెన్స్ లుక్ లో క‌నిపిస్తోంది. నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే విడుదలైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌, `ది ఆల్టిమేట్ డిసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్‌ సురేష్ బొబ్బ‌లి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి కెమెరామేన్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్.

తారాగ‌ణం: పూర్ణ‌, అర్జున్ అంబాటి

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాణ్ జీ గోగ‌న
నిర్మాత‌: రిజ్వాన్‌
కో- ప్రొడ్యూస‌ర్‌: ఖుషి, కె రామ్‌రెడ్డి
లైన్‌ప్రొడ్యూస‌ర్‌: శ్రీ వ‌ల్లి చైత‌న్య‌
సంగీతం: సురేష్ బొబ్బిలి
డిఒపి: బాల్‌రెడ్డి
ఎడిట‌ర్: మ‌ణికాంత్‌