గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్, టెంపర్ డైరెక్టర్… పవన్ కళ్యాణ్ హీరో

గబ్బర్ సింగ్… పవన్ కళ్యాణ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో చూపించిన సినిమా. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. 9 ఏళ్లు అయిన పవర్ స్టార్ అభిమానులని ఇంకా మత్తులోనే ఉంచిన సినిమా. అరెవో గబ్బర్ సింగ్ కా ఫౌజియో, ఉటావో బంధూక్ లగావ్అం నిషానే అని పవన్ కళ్యాణ్ అంటుంటే మెగా అభిమానులు థియేటర్ల టాప్ లేపారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేశాడు. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హీరోతో బండ్ల గణేష్ మరో మూవీ అనౌన్స్ చేశాడు. గబ్బర్ సింగ్, తీన్ మార్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటివరకూ డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ప్రాజెక్ట్ గురించి మాత్రం స్వయంగా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశాడు. అయితే పీకే బండ్ల గణేష్ ప్రాజెక్ట్ కి ఒక డైరెక్టర్ కలవబోతున్నాడట.

బండ్ల గణేష్ కి టెంపర్ లాంటి హిట్ ఇచ్చిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో పవన్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పూరి పవన్ కాంబినేషన్ అనగానే పవర్ స్టార్ అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీలోనే ఒక క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజీ కాంబో మరోసారి కలిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు. పూరి మార్క్ వన్ లైనర్స్ ని పవన్ చెప్తుంటే విని విజిల్స్ వేయడానికి రెడీగా ఉండండి. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఒకటి మలయాళ రీమేక్ కాగా మరొకటి క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు. పిరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా అవగానే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు అయ్యాక పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ పూరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.