నిఖిల్ కారుకి ట్రాఫిక్‌ పోలీసుల చలాన్లు

18 పేజెస్ ఫస్ట్ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ కారుకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడం, కారు నంబరు ప్లేటు రూల్స్ ప్రకారం లేకపోవడం ఈ రెండు కారణాలతో నిఖిల్ కారుకి రెండు చలాన్లను విధించారు. అయితే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్‌ కారులో లేడని పోలీసులు తెలిపారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల తొమ్మిది వరకూ లాక్ డౌన్ విధించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 1 సడలింపు ఇచ్చి ఆ తర్వాత ఎవరు బయట తిరిగిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్‌ కాలంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిఖిల్‌.. తన భార్య పల్లవి డాక్టర్‌ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ.. ఓ వాలంటీర్‌గా పని చేస్తున్నారు.