వరసగా మూడోసారి మొదటి స్థానం…

యూత్ ఐకాన్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా హైదరబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ నటీనటుల జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 2016లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లోకి ఎంటర్ అయిన రౌడీ హీరో లిస్ట్ లోని జాబితలో 20వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి ఏడాది 2017లో 18 స్థానాలు దాటి వచ్చి రెండో స్థానంలో నిలిచాడు. 2018లో మొదటిసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లో మొదటిసారి టాప్ ప్లేస్ లోకి వచ్చిన దేవరకొండ, ఆ తర్వాత నుండి వరుసగా 2019,2020 సంవత్సరాల్లో టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. ఇక విజయ్ దేవరకొండ ఈ యేడాది మొదటిస్థానంలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాడు. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని మూడో స్థానంలో నిలిచారు. అంతే కాకుండా రామ్ చరణ్ మూడో స్థానంలో, ఎన్టీఆర్ పంతొమ్మిదో స్థానంలో నిలిచారు.

ఇక వరుసగా విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నిలవడంతో రౌడీ అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాత్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఛార్మీ కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.