ఫ్యాన్స్‌కి షాకిచ్చిన పూనమ్ పాండే

బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే 2021వ సంవత్సరం ప్రారంభం అవుతున్న క్రమంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆమె బయటికొచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఆమె డిలీట్ చేసినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో పూనం పాండే అధికార అకౌంట్ సెర్చ్ చేస్తే కనిపించడం లేదు. ట్విట్టర్‌లో మాత్రం ఈ బోల్డ్ బ్యూటీ అందుబాటులో ఉంది. క్రిస్మస్ సందర్భంగా దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో ట్విట్టర్‌లో పూనమ్ ప్రేక్షకులతో పంచుకుంది.

poonam pandey

ఇన్‌స్టాగ్రామ్‌లో పూనమ్ పాండే ఎప్పుడూ సెక్సీ ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపై అవి కనిపించవు. దీంతో అభిమానులు చాలా కలత చెందుతున్నారు. అయితే పూనమ్ ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకుందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.ఆమె ఎందుకు ఇలా చేసిందనే దానిపై ఇంకా సమాచారం అందుబాటులో లేదు.

ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే. గతంలో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. న్యూడ్ ఫొటోలు దిగి గిఫ్ట్‌గా పంపిస్తానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక ఇటీవల గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద బట్టలన్నీ విప్పేసి న్యూడ్‌గా వీడియో షూట్‌లో పాల్గొంది. ఈ వీడియో విడుదల కావడంతో వీడియోను తీసిన వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పూనంపై కూడా కేసు పెట్టారు.