మహేష్ ‘బిగ్ బ్రదర్’ అన్న బాలీవుడ్ హీరో

తెలుగులోనే కాదు.. సౌతిండియాలోనే మంచి క్రేజ్ ఉన్న హీరో మహేష్ బాబు. ఇటీవల సోషల్ మీడియాలో సౌతిండియాలోనే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న హీరోగా మహేష్ రికార్డు సృష్టించాడు. సౌతిండియాలోనే మోస్ట్ హ్యాండ్‌ సమ్ హీరోగా మహేష్ ఉన్నాడు. అయితే ఇప్పుడు సౌతిండియాలోనే కాకుండా ఇండియా వైడ్‌గా మహేష్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఒక యాడ్‌లో మహేష్ పాల్గొన్నాడు.

ranaveer singh and maheshbabu

ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. మహేష్‌తో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసిన రణ్ వీర్.. మహేష్ ఒక జెంటిల్‌మ్యాన్ అని, అతనితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నాడు. ఈ సందర్భంగా మహేష్‌ని ‘బిగ్ బ్రదర్’ అని రణ్ వీర్ సంబోధించడం ఆసక్తికరంగా మారింది. రణ్ వీర్ సింగ్ పోస్ట్‌పై మహేష్ బాబు స్పందించాడు. నీతో కలిసి వర్క్ చేయడం బాగుందని, ఇద్దరికీ ఒకే ఫీలింగ్ అని రిప్లై ఇచ్చాడు.

కాగా రణ్ వీర్, మహేష్ కలిసి ఒక మాల్టీస్టారర్ సినిమా చేయనున్నారనే ప్రచారం ఇటీవల జరిగింది. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించనున్నాడని ప్రచారం జరుగుతోంది.