NTR ‘దేవర’ లో పూజా హెగ్దే ఐటమ్ సాంగ్?

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో పూజా హెగ్దే ఓ ఐటెమ్ సాంగ్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా పూజా ‘రంగస్థలం’ సినిమాలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేశారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.