ఫిలిం నగర్ లో ఘనంగా చంద్ర బాబు నాయుడు గారి జన్మ దిన వేడుకలు

తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శనివారం రోజు జరిగాయి . సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర రావు కుమారుడు యశ్వంత్ , కోడలు విజితల కుమార్తె తన్మయి కృష్ణ పుట్టినరోజు వేడుకలలో భాగంగా చంద్ర బాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి రామకృష్ణ కేక్ కట్ చేశారు.


ఈ వేడుకల్లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు , నిర్మాతలు కె .ఎస్ .రామారావు , పోకిరి బాబు రావు , డి .వి .కె . రాజు , తుమ్మల ప్రసన్న కుమార్ , కాజా సూర్యనారాయణ , ముళ్ళపూడి మోహన్ , సీనియర్ జర్నలిస్టులు భగీరథ, వెంకటేశ్వర రావు, మిద్దె శ్రీరామ్ రెడ్డి, పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగు దేశం , జనసేన , బిజెపి కూటమి విజయం సాధించాలని , చంద్ర బాబు ముఖ్యమంత్రి కావాలని మోహన్ కృష్ణ , రామకృష్ణ, రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్ర బాబు పై రూపొందించిన పాటను ప్రదర్శించారు .