అన్ని ఇండస్ట్రీలని కవర్ చేస్తూ ఫ్లైట్స్ లోనే గడుపుతుంది…

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ అని చెప్పడానికి చేతిలో ఉన్న సినిమాలే కొలమానం. ఈ లెక్కన చూస్తే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డేనే అవుతుంది. ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకూ ప్రతి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా, అందంగా కనిపిస్తూనే నటించి మెప్పించగలను అని చాలా సార్లే ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్ గా మాంచి డిమాండ్ ఉన్నా, షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా అవకాశమొచ్చినప్పుడల్లా ఐటెం గాళ్ గానూ చిందేస్తోంది. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట, చిత్రానికే హైలైట్ గా నిలిచింది.

pooja hegde

యూట్యూబ్ లో జిల్..జిల్..జిగేలు రాణి సాంగ్ ను 107 మిలియన్ల మంది చూశారంటే చరణ్ పూజ కలిసి చేసిన రచ్చ ఏ రేంజులో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. సంక్రాంతికి రాబోతున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హేగ్డే, అదే డేట్ ని రిలీజ్ కానున్న మహేష్ బాబు సరిలేరు నేనీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది. సినిమాకే స్పెషల్ గా నిలవబోయే ఈ పాటలో పూజా డాన్స్ సూపర్ గా ఉండబోతోందని సమాచారం. ఇవి మాత్రమే కాకుండా అఖిల్ సినిమాతో పాటు, ప్రభాస్ జాన్ మూవీలో కూడా పూజా హెగ్డే నటిస్తోంది. తెలుగులో ఇంత బిజీగా ఉన్న భామ హిందీలో కూడా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా ఫ్లైట్స్ లోనే జీవితం గడుపుతుంది.