బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన పాయల్

‘RX 100’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే ”వెంకీమామ, డిస్కో రాజా” సినిమాల్లో నటించి మెప్పించిన పాయల్.. ఆ వెంటనే Rdxలవ్ సినిమాలో మరోసారి బోల్డ్ రోల్ చేసి మత్తెక్కించింది. ఇటీవల ఆహా యాప్‌లో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన సమాచారంతో పాటు పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తన లవర్‌ను పాయల్ సోషల్ మీడియాలో పరిచయం చేసింది.

payal rajput

ఇవాళ పాయల్ రాజ్‌పుత్ తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన లవర్ ఫొటోను బయటపెట్టింది. ”హ్యాపీ బర్త్ డే మై లవ్” అంటూ తన ప్రియుడు సౌరబ్ దింగ్రా పోస్ట్ చేసిన ట్వీట్‌ని ఈ బ్యూటీ రీ ట్వీట్ చేస్తూ లవ్ ఎమోజీలను జత చేసింది. ఈ ఫొటోలో తన లవర్‌తో పాయల్ కలిసి ఉంది.

ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. పాయల్‌కి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ అంటూ విష్ చేస్తున్నారు.