పవన్-క్రిష్ సినిమాకు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ షూటింగ్ గురువారంతో పూర్తి కానుండగా… ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను పూర్తి చేయనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. గురువారం తర్వాత ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడే అవకాశముంది.

PAWAN AND KRISH BREAK

20 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌కు పవన్ విరామం ఇవ్వనున్నాడు. తిరిగి ఫిబ్రవరి రెండోవారం నుంచి ఈ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే అయ్యపనుమ్ కోషియమ్ షూటింగ్‌లో పాల్గొనేందుకే క్రిష్ సినిమా యూనిట్ నుంచి పవన్ బ్రేక్ తీసుకున్నాడని తెలుస్తోంది. మలయాళంలో హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులోకి రీమేక్ అవుతోంది. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రానా కీలక పాత్రలలో నటించనున్నాడు.