తమన్‌కి మరో బిగ్ ఆఫర్

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు ఎస్.ఎస్. థమన్. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో మంచి జోరు మీద ఉన్నాడు. అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో తమన్ రేంజ్ మరింత పెరిగిపోయింది. దీంతో తమన్‌కి వరుస పెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమన్‌కి అవకాశం దక్కింది.

TAMAN lucifer MUSIC OFFER

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత మోహన్ రాజా డైరెక్షన్‌లో లూసిఫర్ రీమేక్‌లో చిరు నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌ అవకాశం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో తమన్ ప్రకటించాడు.

చిరంజీవి లూసిఫర్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, చిరుపై తనకు ఉన్న ప్రేమను చూపించుకోవడానికి ఇది ఒక మార్గమని తమన్ తెలిపాడు.