Bollywood: నాకు అర్జున్ రెడ్డి అంటే చాలా ఇష్టం: ప‌రిణీతి చోప్రా

Bollywood: అర్జున్ రెడ్డితో ఇటు టాలీవుడ్‌లో అటు బాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి బాలీవుడ్‌లో యానిమ‌ల్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ప‌రిణీతి చోప్రా హీరోహీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంపై Bollywood బ్యూటీ ప‌రిణీతి చోప్రా స్పందిస్తూ..

Parineeti chopra

ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ చిత్రంలో ప‌నిచేయ‌డం అంటే నాకు అదొక పాఠ‌శాల అవుతుంది. ఇక ద‌ర్శ‌కుడు సందీప్ (అర్జున్‌రెడ్డి)అంటే ఎంతో ఇష్టం. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌తో మాట్లాడాను.. చాలా మంచి వ్య‌క్తి. ఈ సినిమా స్ర్కిప్టు నాకెంతో న‌చ్చింద‌ని తెలిపింది ప‌రిణీతి చోప్రా. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. గుల్ష‌న్ కుమార్‌, టీ సీరీస్ స‌మ‌ర్ప‌ణ‌లో భ‌ద్ర‌కాళి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భూష‌ణ్ కుమార్‌, ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ Bollywood చిత్రాన్ని నిర్మిస్తున్నారు.